కలం, వెబ్ డెస్క్ : వైయస్సార్ జిల్లా ఖాజీపేట (Khajipet)లో ఇంటర్ విద్యార్థిని కీర్తనను గొంతుకోసి చంపిన నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడిని విచారణ నిమిత్తం మైదుకూరు నుండి తరలిస్తుండగా బాసాపురం చెక్ పోస్ట్ సమీపంలో పోలీసుల నుండి తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో తనను అడ్డుకోబోయిన పోలీసులపై వెంకటేష్ ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. నిందితుడు చేసిన ఈ హఠాత్ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. పరిస్థితిని గమనించిన సీఐ వంశీధర్ వెంటనే అప్రమత్తమై నిందితుడిని నిలువరించేందుకు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో నిందితుడు వెంకటేష్ కాలికి గాయమైంది. వెంటనే పోలీసులు అతడిని కడపలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని వేధించి, నిరాకరించిందనే కక్షతో ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితుడు, ఇప్పుడు పోలీసుల కాల్పుల్లో గాయపడి ఆసుపత్రి పాలవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.
Read Also: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. కారుపై పడ్డ సిమెంట్ ట్యాంకర్
Follow Us On: X(Twitter)

