కలం, వెబ్ డెస్క్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బాలాపూర్ గణపతి లడ్డూ (Balapur Ganesh Laddu)వేలం పాట ఘనంగా ముగిసింది. గ్రామంలోని బొడ్రాయి వద్ద ఏర్పాటు చేసిన ఈ వేలం పాట కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
పోటీ తీవ్రంగా సాగిన ఈ లడ్డూ వేలం పాటలో ఈసారి ఏకంగా 9 మంది కొత్తవారు పాల్గొనడం విశేషం. వేలంలో పాల్గొన్నవారు ఒకరిని మించి మరొకరు పాడటంతో వాతావరణం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది. చివరికి బాలాపూర్ గణనాథుని దివ్య ప్రసాదమైన లడ్డూను సామ ప్రణీత్ రెడ్డి 39 లక్షల రూపాయల భారీ ధరకు దక్కించుకున్నారు. స్వామివారి లడ్డూను అత్యధిక ధరకు కొనుగోలు చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read : ఖైరతాబాద్ త్రిముఖ పోరు: ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు!
Follow Us On : WhatsApp

