Mobile Popup Ad
Mobile Popup Ad

బండి భగీరథ్ కేసులో మరో కీలక పరిణామం

కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీర్‌‌థ‌పై (Bandi Bhagirath)  నమోదైన పోక్సో కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ విచారణ అధికారి డీసీపీ రితి రాజ్ బాధితురాలి నుంచి మంగళవారం వాంగ్మూలం తీసుకోబోతున్నారు. కేసు సమయంలోనే.. బాధితురాలి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన డీసీపీ.. మరోసారి ఆమె నుంచి వివరాలు తీసుకోవాలని భావించారు. ఈ రోజు ఆమెను భరోసా కేంద్రానికి తీసుకురావాలని.. తానే స్వయంగా బాధితురాలి వాంగ్మూలం నమోదు చేస్తానని చెప్పినట్లు సమాచారం. దీంతో, బాధితురాలి చెప్పిన వివరాల ప్రకారం, అవసరమైతే సెక్షన్లలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఆమె వాంగ్మూలమే మొత్తం కేసులో అత్యంత కీలకం కాబోతుంది.

సీసీ కెమెరాల పరిశీలన..

బండి భగీరథ్ తనను పలుమార్లు ఫాంహౌస్‌లకు తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడని బాధితురాలు పేర్కొన్నారు. దీంతో, పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మొత్తంగా, ఈ కేసులో దర్యాప్తు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బాధితురాలు ఆరోపణలకు ఆధారాలు లభిస్తే.. పోక్సో కేసు తీవ్రత నేపథ్యంలో 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>