బ్యాంకాక్ నుంచి గంజాయి.. కేర‌ళ మోడ‌ల్ హ‌ర్ష స‌న్నీ అరెస్ట్‌!

క‌లం, వెబ్ డెస్క్: ముంబై ఎయిర్ పోర్టు (Mumbai Airport)లో అక్ర‌మంగా గంజాయి త‌ర‌లిస్తున్న కేర‌ళ మోడ‌ల్ హ‌ర్ష స‌న్నీ (Harsha Sunny)ని క‌స్ట‌మ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నేడు బ్యాంకాక్ నుంచి ఫ్లైట్‌లో ముంబైకి వ‌చ్చిన హ‌ర్ష స‌న్నీ ఎయిర్ పోర్టులో అనుమానాస్ప‌దంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో అధికారులు ఆమెను క్షుణ్ణంగా త‌నిఖీ చేశారు. ఆమె బ్యాగులో 11 కేజీలకు పైగా గంజాయిని గుర్తించారు. దీని విలువ రూ.11.28 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. క‌స్ట‌మ్స్ అధికారులు స‌న్నీ హ‌ర్ష‌ను అదుపులోకి తీసుకొని ముంబైలోని ఫోర్ట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. హర్ష సన్నీ 2025 మిసెస్ కేరళ పోటీలో పాల్గొని ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>