Mobile Popup Ad
Mobile Popup Ad

‘ఆందోళన చేద్దాం’.. నీట్ విద్యార్థులకు కేజ్రీవాల్ పిలుపు

కలం, వెబ్ డెస్క్: నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ (Kejriwal) తీవ్ర విమర్శలు గుప్పించారు. “నీట్ రద్దు కావడం ఇదేం మొదటిసారి కాదు. ఇప్పటికీ నాలుగు సార్లు ఇలా జరిగింది. రాజకీయ వ్యవస్థ ఎంత కలుషితం అవుతుందో ఇదే పెద్ద ఉదహరణ. అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది? కనీసం ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేరా.. అసలు ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు. నీట్ అభ్యర్థులకు నా సానుభూతి ప్రకటిస్తున్నా. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల మాట వినాలంటే.. ఆందోళన చేయడమే ఒక్కటే మార్గం. ఈ పోరాటంలో కేజ్రీవాల్ మీతో ఎప్పటికీ ఉంటాడు” అని స్పష్టం చేశారు.

ప్రధాని మాటలు విని షాకయ్యా..

పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోవాలన్నా ప్రధాని మోదీ మాటలు విని షాకైనట్లు కేజ్రీవాల్‌ అన్నారు. ప్రధాని చాలా విషయాల్లో దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. అసలు మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉందని.. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మార్కెట్ వ్యవస్థలో అనేక ఊహాగానాలు వస్తున్నాయని.. ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>