కలం, వెబ్‌డెస్క్: నిర్మల్ (Nirmal) జిల్లాలో రైతన్నలు రోడ్డేక్కారు. తమ పంట కొనుగోలు చేయాలని ధర్నాకు దిగారు. వరిధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో అధికారుల ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై రైతులు నిరసనకు దిగారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించారు.
ధాన్యం నిల్వచేయడానికి ఉపయోగించే గన్నీ సంచులు, లారీల కొరతను వెంటనే తీర్చాలని అధికారులను కోరారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

