కీస‌ర ఏసీబీ ట్రాప్‌.. పీఎస్ ఎదుట జ‌నం సంబ‌రాలు!

క‌లం, వెబ్‌డెస్క్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీస‌ర (Keesara) పోలీస్ స్టేష‌న్‌లో ఎస్సై లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB)కి చిక్కిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా స్థానికులు స్టేష‌న్ ముందు బాణ‌సంచా కాల్చి సంబ‌రాలు చేసుకున్నారు. కీస‌ర‌, బోగాపురానికి చెందిన ప్ర‌జ‌లు ఈ సంబ‌రాల్లో పాల్గొన్నారు. కీసర సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ప‌లు కేసుల్లో త‌మ‌ను వేధించార‌ని స్థానికులు చెప్తున్నారు.

కీస‌ర పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చాలా మంది ద‌గ్గ‌ర సీఐ, ఎస్సై లంచాలు తీసుకున్నార‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ స్టేష‌న్ బెయిల్ విష‌యంలో సీఐ ఆంజ‌నేయులు రూ.10 ల‌క్ష‌లు లంచం డిమాండ్ చేశాడు. ఈ మొత్తంలో రూ.5 ల‌క్ష‌ల‌ను ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి బాధితుడి నుంచి తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. న‌గ‌దును స్వాధీనం చేసుకొని సీఐ, ఎస్సైల‌ను అదుపులోకి తీసుకున్నారు. కీస‌ర పోలీస్ స్టేష‌న్‌తో పాటు వీరిద్ద‌రి ఇండ్ల‌ల్లో అధికారులు త‌నిఖీలు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>