కలం, వరంగల్: ప్రజా పాలన కార్యక్రమంలో వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ (Meesala Prakash)తో కొండా వర్గీయులు వాగ్వివాదానికి దిగటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా కలెక్టర్ సత్య శారద, పోలీసుల ముందే మీసాల ప్రకాష్, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ పరమేష్, 13వ డివిజన్ అధ్యక్షుడు బాబు, అక్కడే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత నల్గొండ రమేష్, కాంగ్రెస్ నాయకులు దూషణలు చేసుకున్నారు.
గీసుగొండలో ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుష్మిత పటేల్, వేదికపై నిల్చోని చప్పట్లు కొట్టిన మీసాల ప్రకాష్ నేటి ప్రజా పాలన వేదికపై కూర్చొని ఉండటం సిగ్గుచేటు అని.. దీనిని ఎందుకు ఎందుకు ఖండించలేదంటూ మండిపడ్డారు. రెండు వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కలెక్టర్, పోలీసుల చొరవతో ఘర్షణ సద్దుమణిగింది.

