కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు హిమాన్ష్ రావు ప్రమాదానికి గురయ్యారు. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు గాయమైనట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు హిమాన్ష్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గల ఏఐజీ (AIG) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది. విషయం తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్ (KCR) తన మనుమడిని పరామర్శించేందుకు ఏఐజీ ఆసుపత్రికి బయలుదేరారు. హిమాన్ష్ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

