బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం

కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి సభలు ప్రారంభం కాబోతుండగా.. ఆరో తేదీన ఎర్రవల్లి(Erravalli)లోని తన నివాసంలో కీలక సమావేశం జరపబోతున్నారు. లంచ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి మీటింగ్ ప్రారంభం కానుంది. అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని కేసీఆర్ కార్యాలయం నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో ప్రధాన సమస్యలతో పాటు విద్యార్థులు, యువత, మహిళలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు.

కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ..

ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ (KCR) హాజరవుతారా.. లేదా..? అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి కేసీఆర్ సభకు హాజరు కావడం లేదు. ప్రతి ఆరు నెలలకోసారి సభకు వచ్చి హాజరు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. దీనికి కౌంటర్‌గా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. మళ్లీ సీఎంగానే కేసీఆర్ సభకు వస్తారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత రాకపోవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే, ఆదివారం జరిగే శాసనసభా పక్ష సమావేశం తరువాత దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read : 400 ఎకరాల భూములపై కలెక్టర్ స్పష్టత ఇవ్వాలి: శ్రీనివాస్ గౌడ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>