400 ఎకరాల భూములపై కలెక్టర్ స్పష్టత ఇవ్వాలి: శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని 400 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టారని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆరోపించారు. మెసేజ్ జాబితాలో పెట్టిన భూములను కబ్జా చేయాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని ఆయన అన్నారు. శుక్రవారం నిరసన కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రం లోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన వంట వార్పు కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

అంతకు ముందు పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో ఎక్కువగా మోసపోయింది మహిళలేనన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.4 వేల పెన్షన్ ఇస్తామని, ఇంట్లో అర్హులైన అందరికీ ఇస్తామని చెబితే మోసపోయి ఓట్లు వేశారన్నారు. తులం బంగారం ఇస్తామని మాట తప్పిండ్రు, కళ్యాణ లక్ష్మి అందడం లేదు, పేదింట్లో ఆడపిల్ల పెళ్లి భారంగా మారిందనీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహిళలకు స్కూటీ ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదనీ దుయ్యబట్టారు.

తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని,కేసులకు భయపడవద్దనీ, మనల్ని ఇబ్బంది పెట్టిన వారికి సమాధానం చెప్తాము.కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటామనీ భరోసా ఇచ్చారు. జిల్లాలో నిషేధిత జాబితాలో ఉన్న భూములకు కలెక్టర్.. ఇతర అధికారులు స్పష్టత ఇవ్వాలనీ ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యవహారాలకు కారణమైన పొంగులేటిని కొండా సురేఖ లెక్క తొలగించాలనీ, చాలా మంది మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సతీమణి శారద, మహిళా కార్పొరేటర్లు ఆర్. జ్యోతి, సరస్వతి, మంజుల, మీరబాయ్, లక్ష్మి, నాయకురాళ్లు జ్యోతి, సుధా శ్రీ, సుధ, గాయత్రి, తిరుపతమ్మ, లావణ్య, ప్రతిభ, జహీదా భాను, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, రెహమాన్, మాజీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>