సిద్దిపేటలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. కేసీఆర్‌‌‌కు బహిరంగ సవాల్

కలం, మెదక్ బ్యూరో: అసెంబ్లీకి రాని కేసీఆర్ (KCR) తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం చిన్న కోడూరు ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు భారీ బైక్ ర్యాలీ (Congress Bike Rally) తీశారు. సిద్దిపేట పరిధిలో అల్లిపూర్ శివారు అంతగిరి రిజర్వాయర్ కట్ట మైసమ్మ దేవాలయం నుంచి ర్యాలీగా వెళ్లారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన మోసాలు, అవినీతిని ఎండగడుతూ ప్లేకార్డులతో ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పథకాల పేరుతో తెలంగాణ ప్రజలను మోసగించిన సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అక్రమాల ఛార్జ్‌షీట్‌ను కాంగ్రెస్ ప్రజల ముందు ఉంచిందని, అందుకే బాపు ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని సెటైర్లు వేశారు.

కేసీఆర్ రాజీనామా తట్టుకోలేరని అంటున్న కేటీఆర్.. ‘మీ బాపు అసెంబ్లీకి వస్తే రేవంత్ ధాటికి తట్టుకోలేరు. అందుకే అసెంబ్లీకి రావాలంటే భయపడుతున్నారు’ అని విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ఇప్పటి వరకు కోటి ఇరవై నాలుగు లక్షల జీతం తీసుకున్నారని ఆరోపించారు.

Also Read : కృష్ణాష్టమికి అనసూయ స్పెషల్ డ్యాన్స్.. వీడియో వైరల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>