ఢిల్లీలో భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పట్టపగలే ఆకాశం మేఘావృతమై చిమ్మ చీకట్లు కమ్ముకోగా.. భారీ వర్షం కుండపోతగా కురవడంతో ఢిల్లీ (Delhi Heavy Rain) అతలాకుతలమైంది. నగరంలో రానున్న గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించడంతో పాటు పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉదయం నుంచే ఆకాశం మేఘాలతో నిండిపోగా, అనంతరం భారీ వర్షం ప్రారంభమైంది.

గంటల వ్యవధిలోనే ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వర్షం చేరింది.

Also Read : 400 ఎకరాల భూములపై కలెక్టర్ స్పష్టత ఇవ్వాలి: శ్రీనివాస్ గౌడ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>