epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రేవంత్ రెడ్డికి కేసీఆర్ పరోక్ష చురకలు

కలం, వెబ్ డెస్క్: చాలా రోజుల తర్వాత ప్రత్యక్షంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న కేసీఆర్ (KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని KCR వ్యాఖ్యానించారు. వారికి వేరే లక్ష్యం ఏదీ లేదని పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని కేసీఆర్ పేర్కొన్నారు. గుర్తుతో ఈ ఎన్నికలు జరిగిఉంటే బీఆర్ఎస్ సత్తా ఏమిటో తెలిసేదని వ్యాఖ్యానించారు. నన్ను చనిపోవాలంటూ కొందరు శాపనార్థాలు పెడుతున్నారంటే అటువంటి నేతల మనస్తత్వం ఏమిటో తనకు అర్థమవుతుందన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం  కొత్త పథకాలు ప్రకటించకపోగా ఉన్న పథకాలు రద్దు చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచినట్టు కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుల కోసం నిర్మించిన చెక్‌డ్యామ్‌లను కూల్చేస్తున్నారని .. ఇంతకన్నా దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో అసలు యూరియా సమస్యే లేదని.. కానీ ప్రస్తుతం యూరియా కోసం రైతులు క్యూలైన్లలో పడిగాపులు గాయాల్సి వస్తోందని మండిపడ్డారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గసభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read Also: మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డి అరెస్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>