తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ నివాళులు

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు కార్యక్రమం సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. 26వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (BRS Formation Day) సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జీవన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. సిద్ధిపేట జిల్లా వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా హైదరాబాద్ నందినగర్ లోని ఆయన నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. అక్కడినుంచి తెలంగాణ భవన్ కు వచ్చారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ప్రసంగంపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>