Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్‌కు బిగ్ రిలీఫ్: ఆ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

క‌లం, వెబ్ డెస్క్ : తమిళ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ (TVK chief Vijay)కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో విజయ్ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. తన భార్య సంగీతకు రూ.12.60 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు అఫిడవిట్‌లో చూపడంపై ఓ ఓటరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ వేశారు. వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, అటువంటి సమయంలో ఇంత పెద్ద మొత్తాన్ని అప్పుగా చూపడం వెనుక అనుమానాలు ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు.

ఒక ప్రైవేట్ విద్యా ట్రస్టుకు ఇచ్చిన రూ.20 కోట్ల విషయంలోనూ విజయ్ సరైన వివరణ ఇవ్వలేదని పిటిషనర్ ఆరోపించారు. ఈ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశంపై గతంలో వచ్చిన మరో పిటిషన్‌ను ఇప్పటికే కొట్టివేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఒకే అంశంపై పదే పదే విచారణ జరపడం సాధ్యం కాదని పేర్కొంటూ, తాజా పిటిషన్‌ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఫలితంగా రాజకీయ ప్రస్థానంలో అడుగులు వేస్తున్న విజయ్‌కు ఈ తీర్పు పెద్ద ఊరటగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>