వాటిపై మీ ఎనర్జీ వృథా చేయకండి: అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు!

కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎవరైనా నచ్చకపోతే వారిని వదిలేయాలి తప్ప, ద్వేషించడం లేదా ట్రోల్ చేయడం సరికాదని పేర్కొన్నారు. మనకు ఇష్టం లేని వ్యక్తుల కోసం మన అమూల్యమైన డబ్బును, శక్తిని ఎందుకు వృథా చేయాలని ఆయన ప్రశ్నించారు. ఆ సమయాన్ని వృథా చేసుకోకుండా, మీ సొంత ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలని అభిమానులకు సూచించారు.

ఇదే సమయంలో తన స్నేహితుడు వాసు గురించి ప్రస్తావిస్తూ ఒక సరదా వ్యాఖ్య చేశారు. తన స్నేహితుడు పేరుకు ముందు ‘బన్నీ’ అని పెట్టుకున్నాడని చెబుతూ, ఎవరైనా అలా పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. ఒకవేళ ఇప్పుడు పేరు మార్చుకోవాలనుకుంటే స్టైలిష్‌ VAASU అని మార్చుకోమని సలహా ఇస్తానని అల్లు అర్జున్ సరదాగా పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>