బావమరిదికి కేసీఆర్ కన్నీటి వీడ్కోలు

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తన బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు పార్థీవదేహానికి నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని శ్రీనివాస్ రావు నివాసానికి చేరుకున్న ఆయన.. బావమరిది పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఇచ్చి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ క్రమంలో కేసీఆర్ సైతం భావోద్వేగం చెందారు.

ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీనివాస్ రావు కేసీఆర్ సతీమణి శోభకు స్వయానా సోదరుడు కావడంతో ఆమె సైతం కన్నీటి పర్యంతమయ్యారు. కేటీఆర్, హరీశ్ రావు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జోగినపల్లి శ్రీనివాస్ రావు కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణంపై బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు సంతాపం ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>