కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) గురువు జైశెట్టి రమణయ్య నేడు మృతి చెందారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా మరణించిన జైశెట్టి రమణయ్య (Jaishetty Ramanaiah)కు కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జగిత్యాలకు చెందిన రమణయ్య ఉపాధ్యాయుడిగానే కాకుండా చరిత్రకారుడిగా కూడా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా కేసీఆర్ తనకు అత్యంత ఆత్మీయుడైన రమణయ్యతో తన అనుబంధాన్ని స్మరించుకున్నారు. రమణయ్య సిద్దిపేటలో లెక్చరర్‌గా పని చేస్తున్న సమయంలో కేసీఆర్ ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
రమణయ్య మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రమణయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 1971లో సిద్దిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా రమణయ్య పని చేశారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా రమణయ్యకు పేరుంది. “సౌత్ ఇండియా టెంపుల్స్” అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని సమర్పించి రమణయ్య పీహెచ్‌డీ డాక్టర్ పట్టా పొందారు.

