కలం వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) రాకతో అసెంబ్లీ హీట్ పెరుగుతుందని అంతా భావించారు. కానీ, కేసీఆర్ కేవలం అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి, రెండు నిమిషాలు ఉండి నందినగర్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. అందరికంటే ముందుగానే కేసీఆర్ సభలోకి వచ్చి కూర్చోవడం విశేషం. ఈ సందర్భంగా సీఎం రేవంత్(Revanth Reddy) కేసీఆర్ దగ్గరకు వెళ్లి ఆయనకు కరచాలనం చేయడం ఆసక్తికరంగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి తర్వాత వరుసగా మంత్రులు కూడా కేసీఆర్‌కు (KCR) కరచాలనం చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేసీఆర్‌కు కరచాలనం చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం విశేషం. అసెంబ్లీలో సంతాప తీర్మానాల అనంతరం జీరో అవర్ ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉండగానే కేసీఆర్ సభ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారా? అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం..
కేసీఆర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Interesting Scene in #TelanganaAssembly: #CMRevanthReddy Shakes Hands with #KCR@BRSparty @revanth_anumula @TSwithKCR #harishrao #ktr #kalam #kalamdaily #kalamtelugu pic.twitter.com/wJZwh54J0t— Kalam Daily (@kalamtelugu) December 29, 2025
Read Also: అసెంబ్లీలో థర్డ్ క్లాస్ భాష మాట్లాడొద్దు: బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి
Follow Us On: X(Twitter)


