కలం, వెబ్ డెస్క్: మాజీ సర్పంచ్‌ల (Former Sarpanches) ఆందోళనలతో హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. తమకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్‌లు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో వారు తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పిస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాల (Assembly Sessions) నేపథ్యంలో పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తమకు ప్రభుత్వం రూ. 531 కోట్ల బిల్లులను పెండింగ్ లో ఉంచిందని.. ఈ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మాజీ సర్పంచ్‌లు (Former Sarpanches) డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల కోసం చాలా రోజులుగా మాజీ సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ హాయంలోనే ఈ బిల్లులను చెల్లించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: కవిత ఆన్ ఫైర్.. కేటీఆర్ కౌంటర్ స్ట్రాటజీ!
Follow Us On: Instagram


