Mobile Popup Ad
Mobile Popup Ad

చంద్రబాబుపై కేసీఆర్ తీవ్ర విమర్శలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఒకప్పుడు బతుకు పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవవని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై తీవ్రస్థాయిలో మరోసారి విరుచుకుపడ్డారు. ‘తెలంగాణ పదాన్నే నిషేధించిన పరిస్థితులు గతంలో ఉండేవి.. కొన్ని పార్టీల తీరుతో దు:ఖం వచ్చేది.. అప్పటి సీఎం చంద్రబాబు పాలనలో పాలమూరు జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టిండ్రు. పాలమూరు ప్రజలను అత్యంత హీనంగా చూసిండ్రు. ప్రజలపై విద్యుత్తు ఛార్జీల భారం మోపిన చంద్రబాబు.. పెంచొద్దని బషీర్ బాగ్ వద్ద ధర్నా చేసినవారిపై కాల్పులు జరిపించి.. చంపించాడు’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 ఎఫ్ తీసుకొస్తే తాను తిరగబడ్డానని.. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అన్న నినాదంతో జనంలోకి వెళ్లి తెలంగాణ తీసుకొచ్చానని పేర్కొన్నారు.

Read Also: తోడేలు గుండెలు అదరాలి.. కేసీఆర్ పై సీఎం రేవంత్​ కామెంట్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>