త్వరలోనే కేసీఆర్, కేటీఆర్‌ల యాత్రలు షురూ: శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజల్లో నమ్మకం పోయిందని, బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం కలిగించడానికి త్వరలో తమ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారని ,అలాగే కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తెలిపారు. గురువారం మహబూబ్‌ నగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మహబూబ్‌ నగర్ అభివృద్ధి విషయంలో రాజకీయం చేయడానికి తాను రాలేదని ఆయన తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, ఆస్పత్రుల అభివృద్ధి, అన్ని రంగాల్లో మహబూబ్ నగర్ అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే తాను ముందుకు వెళ్తున్నానని అన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే కష్ట కాలంలో అండగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

ఎస్ఐఆర్ విషయంలో వలసలు వెళ్లిన వారు వచ్చి ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చే విధంగా అవకాశం ఇవ్వాలని, విదేశాల్లో ఉన్న వారు ఆన్లైన్ కూడా చేసుకునేందుకు అవకాశం ఉందనే విషయాన్ని తెలుపాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పైన ఉన్న ప్రాజెక్ట్ ల ఎత్తు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారని, దీంతో కింద మనకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికే కర్ణాటక వెళ్లి అక్రమ ప్రాజెక్ట్ ల నిర్మాణం పరిశీలన చేసి, వాటిని ఆపాలని డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్ లో అన్ని అక్రమ ప్రాజెక్ట్ లపై పోరాటం చేస్తామని,అక్రమ ప్రాజెక్ట్ లు నిలిపి వేసేవరకు పోరాటం కొనసాగుతుందని డిమాండ్ చేశారు.

అధికారంలోకి వచ్చిన తరువాత నిలిచిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని,పెండింగ్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అధికార పార్టీ బెదిరింపులకు ఎవరు భయపడ వద్దని, స్థానిక సమస్యలపై పోరాటం చేయాలనీ పార్టీ శ్రేణులకు సూచించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతకు అందరూ పని చేయాలని, గతంలో జరిగిన పొరపాట్లు సరి చేసుకొని ముందుకు వెలుదామని పిలుపునిచ్చారు.

ఈ క్రమంలోనే రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యా నాయక్, రాష్ట్ర నేత అభిలాష్ రావు సర్ (SIR) ప్రాధాన్యతను వివరించారు. బిఎల్ఏ లు నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, హన్వాడ మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఆంజనేయులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>