కలం, వెబ్ డెస్క్: కాజీపేటలో (Kazipet) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రైల్వే తయారీ యూనిట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఇక్కడ ఇంటర్ సిటీ రైళ్లు తయారీ ప్రారంభించబోతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కాజీపేట యూనిట్ ప్రారంభమైతే.. కోచ్‌ల కొరత దాదాపు తీరినట్లేనని వివరించారు. ఇదిలా ఉంటే, ఈ రైల్వే యూనిట్‌లో గూడ్స్ వ్యాగన్లు, విడి భాగాల తయారీ కూడా చేపట్టబోతున్నారు. కాజీపేట సమీపంలోని అయోధ్యపురంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యూనిట్ కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని రైల్వే అధికారులు వివరిస్తున్నారు. అంతేగాకుండా, ఉత్తర–దక్షిణ రాష్ట్రాలను కలిపే మార్గంలో ఉండటంతో ఈ ప్రాంతంలో భారీ పెట్టుబడులకు కూడా అవకాశం ఉండనుంది.
Read Also: వామ్మో ఎకరం రూ.237 కోట్లు.. రాయదుర్గంలో రికార్డు ధర
Read Also: పిల్లల్ని కనడం లేదు

