కలం, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) వారణాసి పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న నూతన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. పర్యటనలో భాగంగా ఆమె గంగానదిలో పుణ్యస్నానమాచరించి, కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాజకీయంగా కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించే తరుణంలో ఈ ఆధ్యాత్మిక పర్యటనకు (Varanasi) ప్రాధాన్యత సంతరించుకుంది. తన భవిష్యత్ కార్యాచరణ విజయవంతం కావాలని కోరుతూ కవిత ఈ పర్యటన చేపడుతున్నట్లు తెలుస్తోంది. కాశీ పర్యటన ముగించుకుని కవిత గురువారం సాయంత్రమే తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

