కలం, మెదక్ బ్యూరో: జిల్లాలోని కౌడిపల్లి మండలం రాయిలపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు (Koudipalli forest fire) చెలరేగి విస్తరించాయి. గమనించిన స్థానికులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ బ్లోయర్ (Fire Service Blower) సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడం వలన మంటలు ఇతర నివాస ప్రాంతాలకు విస్తరించకపోవడంతో ఒక పెద్ద నష్టం తప్పింది. ఎండాకాలం వల్ల పెరిగిన ఉష్ణోగ్రతలు ఒక ప్రధాన కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు.
Read Also: డీలిమిటేషన్ సెగ.. బిల్లు పత్రాలను కాల్చిన సీఎం స్టాలిన్!
Follow Us On: X(Twitter)

