రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీకి నేడు అంకురార్పణ

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొత్త పొలిటికల్ పార్టీ నేడు ఉనికిలోకి రానున్నది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవిత కొత్త రాజకీయ వేదికను (Kavitha New Party) ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ పేరుతో పాటు జెండా, ఎజెండా, కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రకటించనున్నారు. దీనికి ముందు అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్కులో ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్నారు. సరిగ్గా ఇరవై ఏండ్ల క్రితం తెలంగాణ జాగృతి పేరుతో సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసిన ఆమె ఇప్పుడు అదే పేరును రాజకీయ పార్టీకీ పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిప్రదాతలుగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ నారాయణరావు, చాకలి ఐలమ్మ తదితరుల పేర్లను వివిధ వేదికలకు పెట్టుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు యాభై వేల మంది కార్యకర్తలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసిన జాగృతి శ్రేణులు వారందరికీ తెలంగాణ రుచులతో కిన లంచ్ కూడా ఎరేంజ్ చేశారు.

జయశంకర్ ప్రాంగణం నుంచి పార్టీ ప్రకటన :

మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా కొత్త పార్టీకి కల్వకుంట్ల కవిత శ్రీకారం చుడుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం, కాళోజీ నారాయణరావు ప్రవేశద్వారం పేర్లతో సరిగ్గా ఉదయం 10 గంటలకు పార్టీ (Kavitha New Party) పేరు ప్రకటించనున్నారు. పార్టీ జెండానూ ఆవిష్కరించనున్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం స్వీయ రాజకీయ శక్తికి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యమకారులు, అమరవీరులు, మహిళల సాధికారికత, బీసీలకు రాజకీయ అవకాశాలు.. ఇలాంటి అంశాలన్నింటినీ తన రాజకీయ విజన్‌లో భాగమనే అంశాన్ని ఇప్పటికే ఆమె ప్రకటించారు. వీటన్నింటి గురించి పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రస్తావించనున్నారు.

తెలంగాణ జాగృతి రూపొందించిన షెడ్యూలు ఇదే :

• ఉదయం 7.30 గంటలకు బంజారాహిల్స్ నివాసం నుంచి ర్యాలీగా గన్‌పార్క్ అమరవీరుల స్థూపం దగ్గరకు
• ఉదయం 8.15 గంటలకు అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు
• ఉదయం 8.25 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నుంచి మునీరాబాద్‌కు ప్రయాణం
• ఉదయం 9.30 గంటలకు మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ హాల్ మెయిన్ గేట్ దగ్గరకు రాక
• ఉదయం 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ
• ఉదయం 10.05 గంటలకు ప్రసంగం స్టార్ట్. గంటన్నర పాటు స్పీచ్
• సభ ప్రాంగణం పేరు : ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం
• ప్రధాన ద్వారం : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ద్వారం
• రాణి రుద్రమ దేవి ద్వారం, మారోజు వీరన్న ద్వారం, చాకలి ఐలమ్మ ద్వారాం
• భోజన శాలల పేర్లు : సురవరం ప్రతాపరెడ్డి, సమ్మక్క సారలమ్మ, షోయబుల్లా ఖాన్ (మీడియా ప్రతినిధులకు) పేర్లు
• క్యాడర్, అతిథులకు 34 తెలంగాణ రుచుల వంటకాలతో భోజనాలు

నాన్ వెజ్ వెరైటీస్ : తలకాయ కూర, బోటీ ఫ్రై, తెలంగాణ మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, బొమ్మిడాల పులుసు, హైదరాబాదీ చికెన్ థమ్ బిర్యానీ, మిర్చి కా సాలన్, కోడిగుడ్డు ఇగురు

వెజిటేరియన్ వెరైటీస్ : భగార రైస్, బైంగన్ మసాలా కర్రీ, కందగడ్డ ఫ్రై, పాలకూర పప్పు, మామిడి పప్పు, ఆలూ టామాటా, చామగడ్డ పులుసు, కట్ చారు, సాంబార్, రోటి పచ్చడి, దోసకాయ, ఆవకాయ, పచ్చి పులుసు, పాపడ్, పెరుగు, రైతా, మజ్జిగ, రాగి అంబలి

తెలంగాణ ప్రత్యేక వంటకాలు : మక్క గారెలు, జొన్న రొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలు, మిర్చి బజ్జి.

స్వీట్స్, డిజర్ట్స్ : బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, షాహి తుక్‌డా, జిలేబీ

Read Also: ఏప్రిల్ 27 తర్వాతే పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక.. ఎందుకంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>