కలం, వెబ్ డెస్క్ : కేసీఆర్ కూతురు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) అంటే ముందుగా అక్క అనే భావం గుర్తుకు వస్తుంది. కవిత కంటే అందరి నోట కవితక్కగా ఆమె గుర్తింపు పొందారు. ఈ క్రమంలో కవిత కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఆమె తనను తాను అక్కగా కాకుండా అమ్మగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను అమ్మలా నిరుద్యోగులకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. ప్రతి విద్యార్థికి ఉచిత విద్య అందిస్తానన్నారు. అమ్మ జేబు చూడదు.. కడుపు చూస్తుంది అంటూ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు తాను అధికారంలోకి వచ్చిన తరువా తఉచిత విద్య అందిస్తానని ప్రకటించారు. ఎంత వరకూ చదువుకుంటే అంత వరకు తెలంగాణ బిడ్డలకు ఉచిత వైద్యం అందించే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. ‘ఈ హామీ మీ తల్లి ప్రభుత్వంలో.. మీ అమ్మ ప్రభుత్వంలో అమలు అవుతుంది’ కవిత తెలిపారు.
Read Also: రీల్స్ క్రేజ్ : ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు తీస్తున్న యూత్
Follow Us On: Instagram

