టీఆర్ఎస్ జెండా గ‌ద్దె మోడ‌ల్ ఆవిష్క‌రించిన క‌విత‌

క‌లం, వెబ్‌డెస్క్‌: మే 20 నుంచి జూన్ 20 వ‌ర‌కు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ర‌క్ష‌ణ సేన జెండా పండుగ‌ (TRS Flag Festival)ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు పార్టీ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha) వెల్ల‌డించారు. ఈ మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మోడల్‌లో టీఆర్ఎస్ జెండా గద్దెలు నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో జెండా గద్దెల మోడల్‌ను క‌విత‌ ఆవిష్కరించారు. మూడు ఫీట్ల ఎత్తు, రెండు ఫీట్ల వెడల్పుతో పార్టీ జెండా గద్దెలు నిర్మించాలని పార్టీ శ్రేణుల‌కు సూచించారు. పార్టీ జెండా గద్దె బేస్ ఒక ఫీట్ ఎత్తులో ఉంటుందని, పైభాగం మరో రెండు ఫీట్ల ఎత్తులో ఉంటుందని తెలిపారు. జెండా గద్దె బేస్ కు గ్రీన్ కలర్.. పై భాగంలో ఉండే జెండా గద్దె కు ఎల్లో కలర్, దాని మధ్యలో తెలంగాణ మ్యాప్ బ్లూ కలర్ లో ఏర్పాటు చేయాలని చెప్పారు. తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో టీఆర్ఎస్ అని రాయాలని సూచించారు. జెండా గద్దె బేస్ గ్రీన్ కలర్ మధ్యలో తెలుగులో తెలంగాణ రక్షణ సేన అని రాయాలని చెప్పారు. పార్టీ జెండా కలర్ కోడ్స్ కూడా తాము ఇచ్చిన విధంగానే చూసుకోవాలని.. అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా జెండాలన్నీ ఏకరూపంలో ఉంటాయని కేడ‌ర్‌కు దిశా నిర్దేశం చేశారు. మే 20 నుంచి ప్రారంభం కానున్న జెండా పండుగ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>