నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి : MLA కవ్వంపల్లి

కలం ,కరీంనగర్ బ్యూరో : వేసవిలో తాగు, సాగు నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా నివారణ చర్యలు సత్వరమే చేపట్టాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampalli Satyanarayana) అధికారులను కోరారు. శుక్రవారం ఎల్ఎండి కాలనీలోని ప్రజా భవన్ లో ఆయన మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మానకొండూరు నియోజకవర్గం పరిధిలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న తాగు, సాగు నీటి సమస్యల గురించి అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. వచ్చే మే మాసంలో ఎండలు మరింత తీవ్రతరమై నీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పైపు లీకేజీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నీరు వృధా పోకుండా లీకేజీల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు నీటి ఎద్దడి కలగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజనీర్, ఈఈలు, డీఈలు, ఎంపీడీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.

మహాత్మా నగర్ లో గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే హాజరు

తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలో బొప్పు వనిత – సంపత్ దంపతులు ఇందిరమ్మ ఇంటికి శుక్రవారం గృహప్రవేశం జరుపుకోగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampalli Satyanarayana) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్హోత్రా, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బండారి రమేష్, మహాత్మా నగర్ గ్రామ సర్పంచ్ పొన్నాల సంపత్, ఉప సర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు కుంట రాజేందర్ రెడ్డి, పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి, కనకమల్లు, ఎండి అంకూస్, చంద్రమౌళి, అల్లాడి రఘు తదితరులు పాల్గొన్నారు.

Read Also: కార్పొ’రేట్’ వైద్యం.. తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>