వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..!

కలం, మెదక్ బ్యూరో: కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఒక వ్యక్తికి వైద్యులు హై డోస్ మందులు ఇవ్వడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆందోళనకు సంఘటన సంగారెడ్డి (Sangareddy) పట్టణంలో జరిగింది. కౌడిపల్లి మండలం, సలాబాద్ పూర్ గ్రామంకు చెందిన పులియ సింగ్ (50) నిన్న రాత్రి కడుపు నొప్పితో బాధపడుతూ చికిత్స కోసం సంగారెడ్డిలోని స్టార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు.

అయితే, అక్కడ చికిత్స అందించే క్రమంలో వైద్యులు మోతాదుకు మించిన హై డోస్ మందులు ఇవ్వడం వల్లే పులియ సింగ్ చనిపోయాడని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున చేరుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు.. ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>