Mobile Popup Ad
Mobile Popup Ad

దారుణం.. భార్య ‘నైటీ’ వేసుకుందని నిప్పంటించిన భర్త!

కలం, వెబ్ డెస్క్: చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు గొడవలకు దిగడం సర్వసాధారణమవుతోంది. నచ్చిన వంట చేయాలేదనో, టీవీ రిమోట్ ఇవ్వలేదనో లాంటి కారణాలకే దాడులకు దిగుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో (Karnataka) తన భార్య నైటీ వేసుకుంటుందని, ఏకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు ఓ భర్త. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణ పాటిల్ (29), మంజులా పాటిల్ (27) దంపతులది కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని ఖానాపూర్ తాలూకా నంద్రడ్ గ్రామం. ఇంట్లో చీరకు బదులుగా నైటీ ధరించడంపై భర్త అభ్యంతరం వ్యక్తం చేశాడు.

నైటీ తీసేసి చీర కట్టుకోకపోతే.. నైటీతో సహా భార్యను తగలబెడతానని కృష్ణ బెదిరించాడు. దీంతో గొడవ మరింత ముదిరింది. ఇంట్లో ఉన్నప్పుడు నైటీ ధరిస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించింది. నైటీ మార్చుకునేందుకు నిరాకరించింది. చెప్పిన మాట వినలేదని క్షణికావేశంలో కృష్ణ ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో భార్య మంజులాకు సుమారు 80 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.

Read Also: టీఎంసీ ఖేల్ ఖతమ్ : అమిత్ షా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>