కలం, వెబ్ డెస్క్ : వామపక్షాల బంద్ పిలుపుతో శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా (Exams Postponed) పడ్డాయి. ఈ మేరకు ఎగ్జామ్స్ వాయిదా పడినట్లు విశ్వవిద్యాలయం (Osmania University) ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.
కాగా, నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారంతో ఢిల్లీ అట్టుడుకుతోంది. పేపర్ లీకేజీ కి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే డిమాండ్ తో తెలంగాణలో విద్యాసంస్థలకు వామపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ నేపథ్యంలో ఉస్మానియా పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.
నీట్ పేపర్ లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

