కలం, వెబ్‌డెస్క్:హీరో ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన డార్లింగ్ సినిమా (Darling Movie) గురువారం రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ లవ్ స్టోరీ అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ మధ్య కెమిస్ట్రీ, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటువంటి సినిమా రీ రిలీజ్ కావడంతో అభిమానులు భారీసంఖ్యలో సినిమాను వీక్షించేందుకు థియేటర్లకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సుదర్శన్ థియేటర్‌లో ఘర్షణ జరిగింది. డార్లింగ్ సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన ఓ వ్యక్తి సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో సిబ్బంది అతనిపై దాడిచేసినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: నా పేరుతో వేరే వాళ్లు ఓటు వేశారు : నటి అక్షయ హరిహరన్
Follow Us On: Instagram

