టీఎంసీ ఖేల్ ఖతమ్ : అమిత్ షా

కలం, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ఖేత్ ఖతమ్ అంటూ కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యానించారు. హూఘ్లీ జిల్లా పురశురాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మే 5 తర్వాత బెంగాల్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోతుందని చెప్పారు. తమ కార్యకర్తలను వేధించిన వాళ్లను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎక్కడున్నా వేతికిపట్టుకొచ్చి వారిని చట్టపరంగా శిక్షిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు.

దీదీ గూండాలు బయట తిరగలేరు

బెంగాల్‌లో (West Bengal) బీజేపీ అధికారంలోకి వచ్చాక దీదీ గుండాలు బయట తిరగలేరంటూ హెచ్చరించారు. “29న వాళ్లు ఇళ్ల నుంచి బయటికి రావద్దు” అని అమిత్ షా (Amit Shah) హెచ్చరించారు. ఆరాంబాఘ్ ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని వారికి రక్షణ కల్పిస్తామని.. యువతులతో అసభ్యంగా ప్రవర్తించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో అక్రమ చొరబాటుదారుల సమస్య పెరిగిందని ఆరోపిస్తూ, వారిని దశలవారీగా బయటకు పంపిస్తామని తెలిపారు.

రైతు సమస్యలపై కూడా స్పందించిన అమిత్ షా, “పురశురా ప్రాంతం బంగాళదుంపలకు కేంద్రం. కానీ ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే బంగాదుంపలకు సరైన ధర కల్పిస్తాం. విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాం” అని హామీ ఇచ్చారు. మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. “5వ తేదీ తర్వాత మీ కాలం ముగుస్తుంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది” అని అన్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లో మొదటి దశ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల సరళిని సైతం అమిత్ షా వార్ రూమ్ నుంచి పర్యవేక్షించారు.

Read Also: గల్ఫ్ కార్మికులపై యుద్ధం ఎఫెక్ట్.. విమాన చార్జీలకు రెక్కలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>