ఆదిలోనే అసమ్మతి గళం.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా

కలం, వెబ్ డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే మంత్రి వర్గ విస్తారణ చేపట్టిన నూతన సీఎం డీకే శివకుమర్ (DK Shivakumar) కు షాక్ తగిలింది. ప్రమాణ స్వీకారం చేసి ఇలా మంత్రులకు శాఖలు కేటాయించారో లేదో.. అప్పుడే డీకే కేబినెట్ లో అసమ్మతి గళం మొదలయింది. తమకు కేటాయించిన శాఖల్లో ముగ్గురు మంత్రులకు అసహనం ఉంది. తాజాగా మంత్రి పదవికి రామలింగారెడ్డి (Ramalinga Reddy) రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రామలింగారెడ్డికి నీటిపారుదల శాఖను కేటాయించారు. అయితే ఆయన బెంగుళూరు నగర అభివృద్ధి శాఖను ఆశించారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రామలింగారెడ్డి బాటలోనే మరో ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.

తాను ఎప్పుడూ పదవులు ఆశించలేదని రామలింగారెడ్డి (Ramalinga Reddy) స్పష్టం చేశారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ కేబినెట్ లో తాను పదవులు కోరలేదని స్పష్టం చేశారు. బెంగుళూరు నగర అభివృద్ధి శాఖ ఇస్తామని సీఎం డీకే శివకుమార్ తనకు హామీ ఇచ్చారని తెలిపారు. తనకు అదే శాఖ కావాలని తానెప్పుడూ పట్టుబట్టలేదని చెప్పారు. సీఎం ఇచ్చిన మాట తప్పినందుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశానని.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం.

Read Also: తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామా

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>