epaper
Monday, March 2, 2026
epaper

రోడ్డు ప్రమాదం.. సీనియర్ ఐఏఎస్ మృతి

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సీనియర్ ఐఏఎస్ అధికారి మహంతేశ్ బిళగి(Mahantesh Bilagi) మరణించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మహంతేశ్ తన బంధువులు శంకర్, ఎర్రన్నతో కలిసి ఏ వివాహానికి హాజరవడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో కలుబురగిరిలోని గౌనహల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహంతేశ్, శంకర్, ఎర్రన్న ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

కాగా ఐఏఎస్ అధికారి మహంతేశ్(Mahantesh Bilagi) మరణంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా ఉన్నారు మహంతేశ్, ఆయన కలెక్టర్‌గా జిల్లా పంచాయతీల సీఈఓగా మంచి సేవలు అందించారని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గుర్తు చేసుకున్నారు. ప్రజాసేవలో మహంతేశ్ తనదైన ముద్రవేశారని, అటువంటి సమర్థవంతమైన అధికారి ప్రాణాలు కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. మహంతేశ్ కుటుంబ సభ్యులకు వారు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read Also: స్మృతి మందానాను పలాష్ చీట్ చేశాడా..!

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!