Mobile Popup Ad
Mobile Popup Ad

అమరావతిలో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు

రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day) పురస్కరించుకుని ఏపీలో విద్యాశాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో మాక్‌ అసెంబ్లీ(Mock Assembly) నిర్వహించింది. రాజ్యాంగంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం జరిగింది. ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ప్రత్యేక అతిథులుగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.

అసెంబ్లీలో విద్యార్థులే ప్రజాప్రతినిధుల పాత్రలు పోషించారు. మన్యం జిల్లా విద్యార్థి ఎం లీలా గౌతమ్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించగా, అదే జిల్లాకు చెందిన సౌమ్య ప్రతిపక్ష నేత పాత్రను పోషించారు. విశాఖ జిల్లా విద్యార్థి కోడి యోగి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగా, తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి మాక్‌ అసెంబ్లీ స్పీకర్‌గా సభను నిర్వహించారు. అసెంబ్లీలో బిల్లుల ప్రవేశపెట్టడం, సభ్యుల ప్రసంగాలు, ప్రతిపక్ష ప్రతిస్పందనలు, స్పీకర్ సూచనలు—అన్నీ నిజమైన అసెంబ్లీ తరహాలో సాగాయి. సామాజిక మాధ్యమాల నియంత్రణ – పర్యావరణ పరిరక్షణపై అన్న అంశంపై చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాల నియంత్రణ బిల్లు, పర్యావరణ పరిరక్షణ బిల్లు మాక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం విశేషం.

ఇవన్నీ విద్యార్థుల దృష్టిలోని సమస్యలు, పరిష్కారాలు ఎలా ఉండాలన్న దానిపై వారు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డిజిటల్‌ యుగంలో సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ అవసరం, పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థుల నుంచే మార్పు మొదలుకావాలని సూచించారు. ఈ మాక్‌ అసెంబ్లీ(Mock Assembly) కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 45 వేల పాఠశాలలకు ప్రత్యక్ష ప్రసారం చేశారు.

రాజ్యాంగ విలువలు కాపాడుకోవాలి: చంద్రబాబు

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి భారత పౌరుడి బాధ్యత. భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే శక్తిమంతమైన పునాది. స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత భారత్‌ లక్ష్య సాధనలో రాజ్యాంగ మార్గదర్శకం కీలకం” అని పేర్కొన్నారు. విద్యార్థులను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని చెప్పారు.

Read Also: రోడ్డు ప్రమాదం.. సీనియర్ ఐఏఎస్ మృతి

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>