Mobile Popup Ad
Mobile Popup Ad

ఘోర విషాదం.. 10 మంది దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. భత్కల్ (Bhatkal) సమీపంలోని వెంకటాపుర నదిలో ముత్యపు చిప్పల వేటకోసం వెళ్లిన పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో 8 మంది మహిళలే ఉన్నారు.

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శారదాహోళె గ్రామానికి చెందిన 14 మంది ఆదివారం నదిలోకి ముత్యపు చిప్పల కోసం పడవలో బయల్దేరారు. అయితే ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో పడవ బోల్తా పడింది. నీటి ఉద్ధృతితో  పడవలో ఉన్నవారంతా కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే 10 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది. ఇద్దరిని సురక్షితంగా రక్షించగా.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: రెండు కార్లు ఢీ, మహిళా మృతి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>