పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్రం ప్రకటన

కలం, వెబ్ డెస్క్: దేశంలో పెట్రోల్, డీజిల్ (Petrol Diesel) కొరత ఏమాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎల్పీజీతో సహా అన్ని రకాల చమురు నిల్వలు కావాల్సినంత మేరకు ఉన్నాయని.. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర సహజ వాయు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వివరించారు. దేశీయ రిఫైనరీ కంపెనీలు తమ అత్యుత్తమ స్థాయి మేరకు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా, వ్యూహాత్మక ఆయిల్ నిల్వలు కూడా ప్రస్తుతం నిలకడ స్థాయిలోనే ఉన్నాయని చెప్పారు. అయితే, కొన్ని చోట్ల చమురు కొనుగోళ్లు అనూహ్యంగా పెరిగాయని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం కొన్ని రకాల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు తమ ఔట్ లెట్లను మరో చోటకు తరలించడం కారణంగా అధిక స్థాయి చమురు ఉపయోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>