కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా (TSGLI) కరీంనగర్ జిల్లా కార్యాలయాన్ని (TSGLI Office) నూతనంగా ప్రారంభించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(IDOC) భవనంలోకి మార్చినట్లు జిల్లా బీమా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై TSGLI జిల్లా కార్యాలయం నూతన కలెక్టరేట్ భవనంలోని రూమ్ నంబర్ 201లో సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, పాలసీదారులు తమ బీమా సేవలకు సంబంధించి నూతన కార్యాలయాన్నే సంప్రదించాలని ఆయన కోరారు.
అందించే సేవలు:
డెత్ క్లెయిమ్స్ (మరణానంతర క్లెయిమ్లు), మెచ్యూరిటీ క్లెయిమ్స్
కొత్త పాలసీల నమోదు, పాలసీ వివరాల మార్పులు
బీమా రుణాలు, ఇతర సేవలు
ఉమ్మడి జిల్లా పరిధిలోని ఉద్యోగులు, పాలసీదారులు ఈ మార్పును గమనించి తమ అవసరాల నిమిత్తం నూతన కలెక్టరేట్ రూమ్ నంబర్ 201లో ఉన్న బీమా కార్యాలయాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

