Mobile Popup Ad
Mobile Popup Ad

ట్రాఫిక్ కానిస్టేబుల్ చొరవ.. సమయానికి నీట్ కేంద్రానికి విద్యార్థి

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో నిర్వహించిన నీట్-2026 పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఆలస్యమవుతుండగా, విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ (Karimnagar Traffic Constable) వెంటనే స్పందించి సహాయం అందించారు. విద్యార్థి పరీక్ష కేంద్రం అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సమయానికి చేరుకునేలా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తూ, అవసరమైన మార్గదర్శకత్వం అందించి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ చూపిన అప్రమత్తత, మానవతా దృక్పథాన్ని విద్యార్థి కుటుంబ సభ్యులు, కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం చేయడం పోలీసుల బాధ్యతలో భాగమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>