రక్త తిలకంతో ఎంట్రీ.. అనిల్ రావిపూడి కొత్త సినిమా స్టార్ట్

కలం, సినిమా : టాలీవుడ్‌ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల వెంకటేశ్- కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో  తన కొత్త సినిమాను ప్రత్యేకంగా ప్రకటిస్తూ అభిమానులలో ఆసక్తి రేకెత్తించారు. రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌లతో సహా హీరోయిన్స్ కీర్తి సురేష్, కృతి శెట్టిలను  కత్తితో భయపెడుతూ దర్శకుడు అనిల్ రావిపూడి కనిపించడం ఆసక్తికరంగా మారింది.

ఈ వీడియోలో ‘రక్తంతో విజయ తిలకం’ అనే కాన్సెప్ట్‌తో టీమ్‌ను చూపించడం ద్వారా సినిమా టోన్‌పై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తుంది.  అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే కామెడీ, యాక్షన్, ఎమోషన్ మేళవింపుతో ఉంటాయి. ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా అదే తరహాలో ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌ల కాంబినేషన్‌తో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ప్రమోషనల్ కంటెంట్‌తోనే హైప్ పెంచిన దర్శకుడు అనిల్, త్వరలోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవ్వనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>