కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు (Revanth Reddy Birthday)ను పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకుడు మెట్టు సాయికుమార్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు సీఎంపై కృతజ్ఞతగా రైతులు ఈ అరుదైన కళాఖండాన్ని సృష్టించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో, రైతులు సుమారు ఇరవై రోజులపాటు శ్రమించి వరి నారుతో సీఎం రేవంత్ రెడ్డి రూపాన్ని పొలంలో తీర్చిదిద్దారు. పచ్చని వరి చేనులో సీఎం ముఖచిత్రం స్పష్టంగా కనిపించేలా రైతులు ఈ కళాఖండాన్ని రూపొందించడం ఎంతగానో ఆకట్టుకుంటోంది. నవంబర్ 8న ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక పొలం చిత్రాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.

