కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ పట్టణం టూ టౌన్ ఎస్సై (Karimnagar SI) చంద్రశేఖర్ యాదవ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత ఐదు రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తన భార్య కడుపునొప్పి భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దివ్య మృతదేహాన్ని కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సీతంపేట గ్రామానికి తరలించారు. దివ్య మృతికి భర్త చంద్రశేఖరే కారణమని బంధువులు దాడికి యత్నించారు. దీంతో గ్రామస్తులు బంధువుల నిరసన మధ్య దివ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా శనివారం ఐదు రోజుల కార్యక్రమానికి అత్తగారిల్లు అయిన సీతంపేటకు వచ్చారు. అత్తగారింట్లోనే ఎస్ఐ చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. గదిలో నుంచి ఎంతకీ బయటికి రాకపోవడంతో అనుమానంతో చూడగా ఉరివేసుకొని ఉండడంతో జమ్మికుంట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చంద్రశేఖర్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల మరణాలతో ఇద్దరు చిన్నపిల్లలు అనాథలయ్యారు.

