కలం, వెబ్ డెస్క్: జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) వ్యవహారం రోజురోజుకూ హీటెక్కుతోంది. పార్టీ మారతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు బుజ్జగింపులు మొదలుపెట్టారు. శనివారం మంతులు శ్రీధర్ బాబు (Sridhar Babu), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Lakshan Kumar) జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ వైఖరితో తీవ్ర అసహనంతో ఉన్న జీవన్ రెడ్డిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మారే ఆలోచనను విరమించుకోవాలని మంత్రులు సూచించారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ (Congress party) మీ సేవలను గుర్తుంచుకొని ఉత్తమ పదవిని ఇస్తుందని జీవన్ రెడ్డితో మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది. సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
Read Also: కుళ్లిన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు.. తయారీ కేంద్రం సీజ్
Follow Us On: Youtube

