Mobile Popup Ad
Mobile Popup Ad

అక్రమ ఇసుక రవాణాపై కరీంనగర్ పోలీసుల ఉక్కుపాదం

కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లా పోలీస్ కమిషనరేట్ (Karimnagar Police) పరిధిలో అక్రమ ఇసుక (Illegal Sand) రవాణా, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. గత మార్చి నెలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 120 కేసులు నమోదు చేసి 139 వాహనాలను స్వాధీనం చేసుకుని 161 మంది నిందితులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అక్రమ ఇసుక రవాణా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా రోడ్డు భద్రత, పర్యావరణ సమతుల్యత, ప్రజా శాంతి భద్రతలపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కరీంనగర్ టౌన్ డివిజన్ పరిధిలో 15 కేసులతో పాటు 12 వాహనాల స్వాధీనం చేసి 15 మంది నిందితులపై చర్యలు తీసుకున్నారు. రూరల్ డివిజన్ పరిధిలో అత్యధికంగా 73 కేసులు, 79 వాహనాల స్వాధీనం, 98 మంది నిందితులపై కేసులు నమోదయ్యాయి. హుజురాబాద్ డివిజన్ పరిధిలో 32 కేసులు, 48 వాహనాల స్వాధీనం, 48 మంది నిందితులపై చర్యలు తీసుకున్నారు. మార్చిలోనే కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 28 ఎఫ్‌ఐఆర్‌లు, 36 వాహనాల స్వాధీనం, 40 మంది నిందితులపై చర్యలు తీసుకున్నారు.

జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 15 కేసులు, 24 వాహనాల స్వాధీనం, 24 మంది నిందితులు నమోదు అయ్యారు. ఎల్‌ఎండీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 కేసులు నమోదయ్యాయి. మానకొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 కేసులు, 10 వాహనాలు, 15 మంది నిందితులు గుర్తించబడ్డారు. కరీంనగర్-II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కేసులు, 6 వాహనాలు, 9 మంది నిందితులపై చర్యలు తీసుకున్నారు. 2026 సంవత్సరంలో మార్చి నెల వరకు కమిషనరేట్ పరిధిలో మొత్తం 245 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, 357 వాహనాలను స్వాధీనం చేసుకుని, 422 మంది నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు.

టౌన్ డివిజన్ లో 24 కేసులు, 27 వాహనాలు, 32 నిందితులు, రూరల్ డివిజన్లో 139 కేసులు, 203 వాహనాలు, 241 నిందితులు, హుజురాబాద్ డివిజన్ లో 82 కేసులు, 127 వాహనాలు, 149 నిందితులపై చర్యలు తీసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తవ్వకం, రవాణా, నిల్వ, విక్రయాల్లో పాల్గొనే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

సీపీ సందేశం..
“అక్రమ ఇసుక రవాణా (Illegal sand mining) వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. ఇలాంటి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించము. సంబంధిత పోలీస్ స్టేషన్‌ల పరిధిలో తనిఖీలు, నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం” అని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Read Also: విమానంలో వైన్ తాగుతున్నారా? జాగ్రత్త!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>