Mobile Popup Ad
Mobile Popup Ad

రూ.20 లక్షల సుడా నిధులతో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 53వ డివిజన్‌లో రూ.20 లక్షల సుడా నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు నగర మేయర్ (Karimnagar Mayor) కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా సీసీ డ్రైన్ నిర్మాణ పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు.

నగరంలోని ప్రతి డివిజన్‌లో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, 53వ డివిజన్ కార్పొరేటర్ కొంపెల్లి శ్వేత రమన్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Read Also: ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈసారి తప్పు చేయొద్దు: రాహుల్ గాంధీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>