కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మీడియా లో సెన్సేషనల్ కోసం అబద్ధాలు ప్రచారం చేయొద్దని నారాయణపేట మాజీ డీసీసీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి (Kumbham Shiva Kumar) విజ్ఞప్తి చేశారు. శనివారం నారాయణపేట లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై ఉన్న లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో ఏఐసిసి సభ్యురాలు మీనాక్షి నటరాజన్ ను అనవసరంగా లాగారని ఆయన అన్నారు. తనపై లైంగిక ఆరోపణల పేరుతో శ్రీలత అనే మహిళ తనను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఇతర రాజకీయ నాయకుల సహాయం తీసుకొని తనను మానసికంగా వేధిస్తోందని అన్నారు.
ఆమె తనపై లైంగిక వేధింపులు చేశారని హైదరాబాదు, బెంగళూరులో కేసు నమోదు చేస్తే ఎలాంటి ఆధారాలు లేవని కేసును కొట్టివేయడం జరిగిందని తెలిపారు. తనపై చర్యలు తీసుకోవాలని మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) కు ఆమె వినతిపత్రం ఇస్తే చర్యలు తీసుకోలేదనే ఆరోపణతో పరువు నష్టం కింద రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ కోర్టులో మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ అధ్యక్షులు, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వర్ణిక రెడ్డి, ఆమె తమ్ముడు పై ప్రైవేటు కేసు చేయాలని కోర్టును విన్నవిస్తే దాన్ని కోర్టు రాజకీయ కోర్టుకు బదిలీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసు లేదన్నారు.
అయితే అనవసరంగా తన కేసును బూచి చూయిస్తూ మధ్యప్రదేశ్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా మీనాక్షి నటరాజన్ ను ఎదుర్కోలేక మధ్యప్రదేశ్ నాయకుడు స్పెన్సర్ లాల్ ఆమె నామినేషన్ ను తిరస్కరణకు గురయ్యేలా చేశాడని మండిపడ్డారు. తాను నారాయణపేట లో పుట్టకపోయిన తన బావ చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి ఆశయాల కోసం ఇక్కడ పనిచేస్తున్న అని, గత 20 సంవత్సరాలుగా తాను ఎన్ని అవమానాలు, కేసులను ఎదుర్కొన్న ఆయన ఆశయాల నెరవేర్చడానికి వారి వారసులను ఇక్కడకి తీసుకురావడానికి కృషి చేశానన్నారు.
చిట్టెం పర్ణికా రెడ్డి గత ఎన్నికల్లో గెలిచిన వెంబడే సివిఆర్ ఆశయ సాధనలో భాగంగా సాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామన్నారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. భూములు కోల్పోతున్న వారికి సీఎంతో మాట్లాడి ఎకరాకు 20 లక్షల చొప్పున, రైతులకు ఆన్లైన్ లో డబ్బులు వేయించడం జరిగిందన్నారు నారాయణపేట నియోజకవర్గం లోని దాదాపు 70 శాతం భూములను ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లతో తడపనున్నామని పేర్కొన్నారు. తనకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉందని, మరోసారి అనవసర విషయాలపై తన కుటుంబ సభ్యులను లాగితే వారి బండారం బయటపెడతానని ఆయన (Kumbham Shiva Kumar) హెచ్చరించారు.
Read Also: ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈసారి తప్పు చేయొద్దు: రాహుల్ గాంధీ
Follow Us On : WhatsApp

