భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మధుమేహం: కొలగాని

కలం, కరీంనగర్: ప్రపంచ మానవాళికి, ముఖ్యంగా భారతీయులకు మధుమేహ రుగ్మత నిశ్శబ్ద హంతకిగా మారుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ (Kolagani Srinivas) అన్నారు. భారత్‌లో దాదాపు 100 మిలియన్ల మధుమేహ ప్రజలు ఉండడం ఒక హెచ్చరికగా తీసుకోవాలని అన్నారు. ఆదివారం కరీంనగర్ లో లయన్స్‌ ఇంటర్నేషనల్ జిల్లా 320జి నిర్వహించిన డయాలబెటిస్ ర్యాలీ (Diabetes Awareness Rally)లో పాల్గొని మాట్లాడారు. ప్రజలు శారీరక వ్యాయామంతో పాటు ఆహార నియమాలను పాటించాలని కోరారు.

జిల్లా గవర్నర్‌ మోరె భద్రేశం మాట్లాడుతూ.. జిల్లా 320జి పరిధిలోని వందకు పైగా లయన్స్‌ క్లబ్బులు నవంబరు మాసంలో మధుమేహ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమ సమన్వయకర్త లయన్ గుండోజు లక్ష్మయ్య నాయకత్వంలో ‌ తెలంగాణ కూడలిలో మేయర్‌ శ్రీనివాస్, లయన్‌ మోరె భద్రేశం జెండా ఊపి ప్రారంభించిన డయాబెటిస్ ర్యాలీలో పాల్గొన్న లయన్‌ సభ్యులు నినాదాలు చేస్తూ, ప్లెకార్డులను ధరించి నగర పౌరుల దృష్టిని ఆకర్షిస్తూ బస్‌ స్టాండ్ మీదుగా టవర్‌ సర్కిల్ వరకు చేరుకున్నారు.

ఈ డయాబెటిస్ అవేర్నెస్ ర్యాలీలో పీజీడీహెచ్‌ రాజిరెడ్డి, సీనియర్‌ లయన్స్ కెప్టెన్ బుర్ర మధుసూదన్ రెడ్డి, కరీంనగర్ లోని పరిసర ప్రాంతాలలో ఉన్న అన్ని లయన్స్ క్లబ్ సభ్యులు పీఎస్టీలు, జడ్సీలు, ఆర్సీలు, పీఆర్సీలు పీజెడ్సీలు పాల్గొని ప్రోగ్రాంను గ్రాండ్ సక్సెస్ గా నిర్వహించడంలో సహకరించారు. టవర్‌ సర్కిల్‌ వద్ద గుమిగూడిన ప్రజలకు మధుమేహం పట్ల అవగాహన కల్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>